Home  »  Bollywood News  »  క్యాన్సర్ తో తీషా మృతి.. ఆమె తండ్రి ప్రముఖ హీరో 

Updated : Jul 19, 2024

తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. కేవలం ఇరవై ఏళ్ళ వయసులో ప్రముఖ హీరో కుమార్తె  తనువు చాలించింది. వాటి  వివరాలు చూద్దాం.

క్రిషన్ కుమార్(krishan kumar)1995 ని హిందీ చిత్ర సీమని ఒక ఊపు ఊపిన  బెవఫా సనమ్(bewafa sanam)ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అందులోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి.  క్రిషన్ కూతురు పేరు తీషా(tishaa)గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతుంది. అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ జర్మనీ లో తీసుకుంటూ ఉంది. కానీ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. మరో రెండు నెలల్లో తన ఇరవై ఒకటవ పుట్టిన రోజు జరుపుకుంటుంది అనగా  ఈ సంఘటన జరిగింది. పలువురు భారతీయ సినీ ప్రముఖులు తీషా మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. క్రిషన్ కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

ఈ సంఘటనపై క్రిషన్ కుమార్ సోదరుడి కంపెనీ అయిన టి సిరీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇది మా కుటుంబానికి చాలా క్లిష్టమైన సమయం. కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరకి మా వినయ పూర్వక అభ్యర్ధన అంటూ పేర్కొంది. టి సిరీస్ కి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కొన్ని వేళ పాటలు టి సిరీస్ ఆడియో ద్వారానే విడుదల అయ్యాయి. అదే విధంగా కొన్ని సినిమాలని సైతం నిర్మించింది.  టి సిరిస్  అధినేత గుల్షన్ కుమార్. 1997 లో మాఫియా చేతిలో హత్యకి గురయ్యాడు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.